ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Posani : ఫిర్యాదుపై న్యాయ సలహా తర్వాత నిర్ణయం: పోలీసులు - Janasena complaint against Posani

పవన్​ కల్యాణ్​, పోసాని కృష్ణమురళి మధ్య వార్​ ముదురుతోంది. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​లో జనసేన కార్యకర్తలు... మంగళవారం రాత్రి పోసాని కృష్ణమురళీపై ఫిర్యాదు చేశారు. జనసేన ఫిర్యాదును పోలీసులు న్యాయ సలహాకు పంపారు. లీగల్​ ఓపీనియన్​ తర్వాత నిర్ణయం ఉంటుందని పంజాగుట్ట పోలీసులు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి పోసాని కృష్ణమురళీపై జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పవన్​ కల్యాణ్​ పరువుకు భంగం కలిగేలా మాట్లాడారని ఫిర్యాదు ఇచ్చారు.

Posani
ఫిర్యాదుపై న్యాయ సలహా తర్వాత నిర్ణయం -పోలీసులు

By

Published : Sep 29, 2021, 12:00 PM IST

Updated : Sep 29, 2021, 12:42 PM IST

పవన్​ కల్యాణ్​, పోసాని కృష్ణమురళి మధ్య వార్​ ముదురుతోంది. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​లో జనసేన కార్యకర్తలు... మంగళవారం రాత్రి పోసాని కృష్ణమురళీపై ఫిర్యాదు చేశారు. జనసేన ఫిర్యాదును పోలీసులు న్యాయ సలహాకు పంపారు. లీగల్​ ఓపీనియన్​ తర్వాత నిర్ణయం ఉంటుందని పంజాగుట్ట పోలీసులు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి పోసాని కృష్ణమురళీపై జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పవన్​ కల్యాణ్​ పరువుకు భంగం కలిగేలా మాట్లాడారని ఫిర్యాదు ఇచ్చారు.

అసలేం జరిగిందంటే...

తన కుటుంబంపై అభిమానులతో అనుచిత వ్యాఖ్యలు చేయించిన పవన్ కల్యాణ్​పై (Pawan Kalyan) పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) తెలిపారు. పవన్ కల్యాణ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. అభిమానుల దాడిలో తాను చనిపోతే పవన్ కల్యాణే కారణమని పేర్కొన్న పోసాని... ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్​లో మీడియాతో మాట్లాడి వెళ్తున్న క్రమంలో పోసానిపై పలువురు పవన్ అభిమానులు దాడికి (Pawan fans attempt to attack on Posani) యత్నించారు.

పవన్​పై ఫిర్యాదు చేస్తా

అక్కడే ఉన్న పంజాగుట్ట పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్​కు తరలించారు. పోసానిని సురక్షితంగా పోలీసు వాహనంలో ఆయన నివాసానికి తరలించారు. చలన చిత్ర పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన పోసాని... పవన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు విమర్శలు చేశారు. పోసాని విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ అభిమానులు ఆయన వ్యక్తిగత ఫోన్​కు దుర్భాషలాడుతూ సందేశాలు పంపించడం, మాట్లాడటం చేశారు. పవన్ అభిమానుల మాటలను తన కుటుంబపరువు తీసేలా ఉన్నాయని.... అభిమానులను పవన్ నియంత్రణలో పెట్టుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి : ATTACK ON POSANI: పోసాని కృష్ణమురళిపై దాడికి యత్నం

Last Updated : Sep 29, 2021, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details