పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు స్టేటస్ కో ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. సీజీఐ నేతృత్వంలోని ధర్మాసనం దీని పై విచారణ జరపనుంది.
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ - supreme couryt news
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ఆదేశాలపై ఏపీ పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం విచారించనుంది.
సుప్రీంకోర్టు
రాజధాని పిటిషన్‌లో అమరావతి ఐకాస, రైతులు కేవియట్ దాఖలు చేశారు. కేవియట్ పిటిషన్‌దారులకు కాపీని పంపినట్లు ఇదివరకే ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అమరావతిలో ఇళ్లస్థలాల పంపిణీ, ఆర్ 5 జోన్ అంశాల పిటిషన్లపై కూడా విచారణ జరగనుంది. అమరావతి ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్ 5 జోన్ ఏర్పాటుపై హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది.