తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కాప్రా ఏఎస్రావు నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నాలుగు నెలల పసికందు(Baby girl death) మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మరణించిందని మృతురాలి తల్లిదండ్రులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు.
అల్వాల్‌కు చెందిన మధు.. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న తన కుమార్తె హివాన్షికను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందగా.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప(Baby girl death) మరణించిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. లక్షల రూపాయలు కట్టించుకుని తమ బిడ్డను కాపాడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు ఆ ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.