ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీకి రికార్డు స్థాయిలో రుణాలిచ్చాం: నాబార్డు సీజీఎం - NABARD Helps AP

ఏపీ ప్రభుత్వానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో.. రికార్డు స్థాయిలో రూ.32,844 కోట్ల రుణాలు అందించామని నాబార్డు సీజీఎం సుధీర్‌కుమార్‌ జన్నావార్‌ తెలిపారు. కొవిడ్‌ సమయంలో గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు రూ.2,500 కోట్ల ప్రత్యేక ద్రవ్య సదుపాయం కల్పించామన్నారు. భవిష్యత్తులోనూ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.

ఏపీకి రికార్డు స్థాయిలో రుణాలు
ఏపీకి రికార్డు స్థాయిలో రుణాలు

By

Published : Apr 9, 2021, 7:11 AM IST

వ్యవసాయ, మౌలిక సౌకర్యాల కల్పన, అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో.. రికార్డు స్థాయిలో రూ.32,844 కోట్ల రుణాలు అందించామని నాబార్డు సీజీఎం సుధీర్‌కుమార్‌ జన్నావార్‌ తెలిపారు. అంతకు ముందు ఇచ్చిన రుణాలతో పోలిస్తే ఇది 17 శాతం అధికమని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో రుణాల మంజూరు, నాబార్డు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను ఆయన గురువారం విడుదల చేశారు. పంట రుణాలు, దీర్ఘకాల వ్యవసాయ రుణాల కోసం రూ.22,605 కోట్లు రీఫైనాన్స్‌ రూపంలో అందించామని పేర్కొన్నారు. కొవిడ్‌ సమయంలో గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు రూ.2,500 కోట్ల ప్రత్యేక ద్రవ్య సదుపాయం కల్పించామన్నారు. భవిష్యత్తులోనూ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.

2020-21లో నాబార్డు రాష్ట్రానికి ఇచ్చిన నిధులు..

* పోలవరం ప్రాజెక్టుకు దీర్ఘకాలిక నీటిపారుదల నిధి కింద మంజూరు చేసిన రూ.10,466 కోట్లలో కేంద్ర ప్రభుత్వ వంతుగా నాబార్డు రూ.9,897 కోట్లు

* పౌరసరఫరాల సంస్థకు రూ.7,100 కోట్లు

* పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్‌వాడీల్లో ‘నాడు- నేడు’ పథకానికి రూ.2,685 కోట్లు

* గ్రామీణ మౌలిక సదుపాయాల నిధి (ఆర్‌ఐడీఎఫ్‌) కింద 21,205 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధికి రూ.1,335 కోట్లు, గ్రామీణ ఆరోగ్య సదుపాయాల అభివృద్ధికి రూ.356 కోట్లు, 1,714 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి రూ.102 కోట్లు

* నాబార్డు మౌలిక సౌకర్యాల అభివృద్ధి నిధి (నిడ) కింద 2,233 గ్రామీణ రహదారుల విస్తరణ, అభివృద్ధికి ఏపీఆర్‌డీసీకి రూ.1,159 కోట్లు మంజూరు.. రూ.408 కోట్ల విడుదల

* చింతలపూడి ఎత్తిపోతలకు రూ.1,931 కోట్లు మంజూరు.. రూ.1,118 కోట్లు విడుదల

* ఎన్‌డీడీబీ ద్వారా సంగం డెయిరీకి రూ.78 కోట్లు మంజూరు.. రూ.31 కోట్లు విడుదల

* ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను బహుళ సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక రీఫైనాన్స్‌ పథకం కింద 2,587 పీఏసీఎస్‌లకు

రూ.2,021 కోట్లు

* విత్తనాభివృద్ధి సంస్థకు రూ.200 కోట్లు.. మార్క్‌ఫెడ్‌కు రూ.172 కోట్లు

ఇదీ చదవండీ... పరిషత్‌ ఎన్నికల్లో మందకొడిగా ఓటింగ్

ABOUT THE AUTHOR

...view details