తెలుగు రాష్ట్రాలపై అప్పుల భారం.. మూడో స్థానానికి ఏపీ - telugu states debts news
తెలుగు రాష్ట్రాలపై అప్పులభారం పెరుగుతోంది. ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా రుణాలు తీసుకుంటున్నాయి. గతేడాదితో పోలిస్తే దేశంలో ఏపీ మూడోస్థానానికి ఎగబాకింది. ఆబీఐ విడుదల చేసిన బులిటెన్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
తెలుగు రాష్ట్రాలపై అప్పుల భారం.. మూడో స్థానానికి ఏపీ
By
Published : Jul 14, 2020, 7:05 AM IST
అప్పులు తీసుకోవడంలో తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే తెలంగాణలో అప్పుల భారం 38 శాతం పెరగ్గా, ఆంధ్రప్రదేశ్లో 42 శాతం పెరిగింది. గత సంవత్సరం దేశంలో తొమ్మిదో స్థానంలో ఉన్న తెలంగాణ ఈ ఏడాది ఆరోస్థానం పొందగా, ఏపీ ఆరోస్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. సోమవారం రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన బులిటెన్ ఈ వివరాల్ని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ లెక్క ఇదీ!
2018-19తో పోలిస్తే 2019-20లో బహిరంగ మార్కెట్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరించిన స్థూల రుణం 42.10%, నికర రుణం 42.47%మేర పెరిగింది. 2020-21 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నెలకు సగటున రూ.3,333 కోట్ల చొప్పున రూ.10వేల కోట్ల స్థూల రుణం తీసుకొంది. ఇందులో నికర రుణవాటా రూ.8,250 కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. గత ఏడాది అత్యధిక రుణాలు తీసుకున్న రాష్ట్రంగా ఆరోస్థానం ఆక్రమించిన ఆంధ్రప్రదేశ్ 2020-21లో ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం మూడో స్థానంలో నిలిచింది.
తెలంగాణలో ఇలా...
తెలంగాణ రాష్ట్రం 2018-19లో బహిరంగ మార్కెట్ నుంచి స్థూలంగా రూ.26,740 కోట్లు, నికరంగా రూ.22,183 కోట్ల రుణం సేకరించింది. 2019-20 కల్లా స్థూల రుణం రూ.37,109 కోట్లు, నికర రుణం రూ.30,697 కోట్లకు చేరింది. దీన్నిబట్టి ఏడాది కాలంలో స్థూలరుణం 38.77%, నికర రుణం 38.38% పెరిగింది. గత ఏడాది దేశంలో బహిరంగమార్కెట్ నుంచి అత్యధిక రుణం సేకరించిన 9వ రాష్ట్రంగా నిలిచింది. 2020-21 సంవత్సరంలో ఏప్రిల్, మేనెలల్లో తెలంగాణ రాష్ట్రం స్థూలంగా రూ.8వేల కోట్లు, నికరంగా రూ.6,750 కోట్ల మేర సేకరించింది. ఈ విషయంలో రాష్ట్రం 6వ స్థానాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది ఇప్పటివరకు తీసుకున్నదాన్నిబట్టి చూస్తే మొత్తం ఆర్థిక సంవత్సరంలో స్థూలరుణం రూ.48వేల కోట్లకు, నికర రుణం రూ.40,500 కోట్లకు చేరే అవకాశం ఉంటుంది.
2019 - 20లో అధిక రుణాలు సేకరించిన రాష్ట్రాల జాబితా