ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పడిపోతున్న ఉష్ణోగ్రతలు... వణుకుతున్న భాగ్యనగర ప్రజలు - Telangana news

రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలతో భాగ్యనగర ప్రజలు వణుకుతున్నారు. తప్పనిసరై బయటికి వస్తున్నవారు.. చలి నుంచి కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

day-to-day-falling-temperatures-in-hyderabad
హైదరాబాద్​లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

By

Published : Dec 21, 2020, 12:24 PM IST

గత రెండు రోజులుగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో హైదరాబాద్ నగర ప్రజలు వణుకుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున శివార్లతో పాటు నగరంలోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాత్రికి చలి పెరగడం ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపిస్తోంది.

ఆదివారం రాత్రి సమయానికి శివార్లలో అత్యల్పంగా బీహెచ్​ఈఎల్ వద్ద 12.5 డిగ్రీలు, బండ్లగూడ 12.9, కుత్బుల్లాపూర్​లో 13.9, రాజేంద్రనగర్​లో 14.1, గచ్చిబౌలిలో 14.4, వనస్థలిపురంలో 14.5, హయత్​నగర్ 14.6, మాదాపూర్​ 15.1, షాపూర్​నగర్​ 15.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details