తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కాప్రాలో రామకృష్ణ అనే వ్యక్తి జులై 20న అనుమానాస్పద స్థితి(suspicious death)లో మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించిన పోలీసులు ఆ నివేదిక ఆధారంగా అతడిది హత్యేనని నిర్ధారణకు వచ్చారు. రామకృష్ణ హత్య కేసును దర్యాప్తు చేస్తూ.. అతడి భార్యను విచారించారు. విచారణలో ఆమె చెప్పిన విషయాలు విని పోలీసులే నివ్వెరపోయారు. ఆమె ఏం చెప్పింది? ఇంతకీ ఏం జరిగింది? రామకృష్ణను హత్య చేసింది ఎవరంటే?
అసలేం జరిగిందంటే..
మేడ్చల్ జిల్లా కాప్రాలో భార్యా పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు రామకృష్ణ. వారు గతంలో నారాయణగూడలో ఉన్న సమయంలో.. అతడి కుమార్తె భూపాల్ అనే యువకుడితో ప్రేమగా ఉండటం గమనించాడు. తరచూ అతనికి ఇంట్లో నుంచి డబ్బు తీసుకెళ్లి ఇవ్వడం చూశాడు. 17 ఏళ్ల తన కూతురికి.. ఆ వయసులో కలిగేది ప్రేమ కాదు ఆకర్షణ అని చెప్పి.. ఆ యువకుడితో మాట్లాడటం మానేయమని(Father rebuked daughter) అన్నాడు. ఆమె తండ్రి మాటలు వినకుండా అతడితో తన ప్రేమాయణం సాగించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తన గారాలపట్టి తన మాట వినకపోవడంతో ఆ కన్నగుండె విలవిలలాడింది. యువకుడి మాయలో పడి తన జీవితం ఎక్కడ నాశనం చేసుకుంటుందోనని బాధ పడింది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తన చిన్నారికి ఎలాంటి ఆపద రాకూడదని భావించిన రామకృష్ణ.. భూపాల్ను పిలిచి తన కూతురుతో మాట్లాడొద్దని నచ్చజెప్పాడు.
పగ పెంచుకుని..
రామకృష్ణ మాటలు ఖాతరు చేయని భూపాల్.. ఆ బాలికను తరచూ కలవడం.. మాట్లాడటం చేస్తూ ఉండేవాడు. ఇది గమనించిన రామకృష్ణ.. ఈసారి పోలీసులకు ఫిర్యాదు(father complaint on daughter's boyfriend) చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భూపాల్ను అరెస్టు చేశారు. తనను జైలుకు పంపిన ప్రేయసి తండ్రిపై ప్రియుడు పగ పెంచుకున్నాడు. కారాగారం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన ప్రియురాలిని కలిశాడు. ఆమె తండ్రి బతికుండగా.. వాళ్లు కలిసి ఉండటం కుదరదంటూ ఆమెకు లేనిపోని మాటలు నూరిపోశాడు. ప్రియుడి మాటలు నిజమని నమ్మిన ఆ బాలిక అతడు చెప్పినట్లు చేయడానికి అంగీకరించింది.