ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పండగ తెచ్చిన రద్దీ.. కిక్కిరిసిన ప్రయాణ ప్రాంగణాలు - Passengers are in trouble

Dasara rush at all stations: దసరా పండుగ సందర్భంగా... బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను, రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. ప్రత్యేక బస్సులకు ఆర్టీసీ సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తుండగా రైల్వేశాఖ మాత్రం తత్కాల్ ఛార్జీలను వసూలు చేస్తుంది. ఇక ప్రైవేటు ట్రావెల్స్‌ ఎప్పటిలాగే ప్రయాణికులను నిలువు దోపిడి చేస్తున్నాయి.

Dasara rush at all stations
Dasara rush at all stations

By

Published : Oct 2, 2022, 1:15 PM IST

Dasara rush at all stations: తెలంగాణలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ప్రయాణ ప్రాంగణాలకు కిటకిటలాడిపోతున్నాయి. ఒక పక్క రైల్వే స్టేషన్లు, మరొకపక్క బస్ స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. దక్షిణ మధ్య రైల్వేశాఖ దసరా, దీపావళి పండుగల సందర్బంగా 315 ప్రత్యేక రైళ్లను నడిపిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేష్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని సర్వీసులకు అదనపు బోగీలను కూడా ఏర్పాటు చేశామన్నారు.

రైల్వే దోపిడి.. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో ప్రయాణికులు రైళ్ల సమయవేళలకు ముందుగానే స్టేషన్​కు చేరుకొని స్టేషన్ వద్ద పడిగాడుపులు కాస్తున్నారు. రాత్రి 10, 11 గంటలకు వెళ్లే రైళ్లకు సైతం.. సాయంత్రం ఆరుగంటలకే స్టేషన్​కు చేరుకుంటున్నారు. దీంతో రద్దీ భారీగా పెరిగిపోయిందని స్టేషన్ ఇంఛార్జ్​లు చెబుతున్నారు. ప్రత్యేక రైళ్లకు తత్కాల్ చార్జీలను వసూలు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇప్పటికే దాదాపు అన్ని రైళ్లలో రిజర్వేషన్లు అయిపోయాయని ప్రయాణికులు వాపోతున్నారు.

టీఎస్​ఆర్​టీసీ ప్రత్యేక బస్సులు.. టీఎస్​ఆర్​టీసీ దసరా పండుగ సందర్భంగా 4,198 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 3,795 ప్రత్యేక బస్సులను, ఆంధ్రపదేశ్​కు 328 ప్రత్యేక బస్సులను, కర్ణాటకకు 75 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లు అన్నీ ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. ప్రధాన బస్ స్టేషన్లు ఎంజీబీఎస్, జేబీఎస్ లతో పాటు దిల్‌సుఖ్‌ నగర్, లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్​బీ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్.బీ.నగర్ లతో పాటు జంట నగరాలలోని వివిధ శివారు కాలనీల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రత్యేక బస్సులకు ఆర్టీసీ ఎటువంటి అదనపు ఛార్జీలను వసూలు చేయటం లేదు. అయితే పలు స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

ప్రైవేట్​ బస్సు యాజమాన్యం దోపిడి.. ఆర్టీసీ ఎటువంటి అదనపు ఛార్జీలను వసూలు చేయకపోయినా ప్రైవేటు బస్సు నిర్వాహకులు మాత్రమే ప్రయాణికుల చేతిచమురు వదిలిస్తున్నారు. ప్రైవేట్ బస్సుల ఛార్జీలు విమాన ఛార్జీలను తలపిస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వాటిపై నియంత్రణ లేకపోవడంతో ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అదనపు ఛార్జీలు వసూలు చేసే ప్రైవేటు ట్రావెల్స్‌పై చర్యలకు ప్రభుత్వం ఎందుకు పూనుకోవడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

బస్సులను మరింత పెంచాలి.. దసరా పండగ వేళ ఇంటికి వెళ్తున్న ప్రజలకు మాత్రం... ప్రయాణ ఇబ్బందులు మాత్రం తప్పేలా లేవు. బస్సు సర్వీసులను మరిన్ని పెంచాలని... ప్రయాణికులు కోరుతున్నారు. అదనపు ఛార్జీలు వసూలు చేసే.. ప్రైవేటు బస్సు నిర్వాహకులపై చర్యలకు డిమాండ్‌ చేస్తున్నారు.

పండగ తెచ్చిన రద్దీ.. కిక్కిరిసిన ప్రయాణ ప్రాంగణాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details