తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి కర్నూలు జిల్లా వైపు పడవ ప్రయాణాలు ప్రమాదకరంగా కొనసాగుతున్నాయి. సిద్దేశ్వరం, సంగమేశ్వరం, బండి ఆత్మకూర్ వైపు కృష్ణానది మీదుగా దాటుతున్నారు. అటు మూగజీవాలను సైతం ప్రమాదకర పరిస్థితుల్లోనే నదిని దాటిస్తున్నారు.
తెలంగాణ: నదిలో ప్రమాదకర పడవ ప్రయాణం - danger boat journey in nagarkurnool district
నది అవతలివైపున ఉన్న సంతకు పశువులను తీసుకెళ్లాలంటే 200 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని, వారు నదీమార్గాన్నే ఎంచుకున్నారు. మనుషులు వెళ్లడమే ప్రమాదకరం అంటే... పశువులను కూడా ఆ మార్గంలో తీసుకెళ్లారు. వారు పడవల్లో వెళ్తూ.. మూగజీవాలను మాత్రం నదిలో ఈదుకుంటూ తీసుకెళ్లారు. ఏ వైపు నుంచి ప్రమాదమొచ్చినా.. మూగజీవాల ప్రాణాలు నీటిలో కలవాల్సిందే. ప్రీవెడ్డింగ్ షూటింగ్ కోసం వెళ్లిన ఓ వీడియోగ్రాఫర్ కెమెరాకు చిక్కిన ఈ వీడియో ఆందోళన రేకెత్తిస్తోంది.
తెలంగాణ: పశువుల రవాణాకు నదిలో ప్రమాదకర పడవ ప్రయాణం
ప్రతి బుధవారం సింగోటంలో పశువుల సంత జరుగుతుంది. జీవాల క్రయవిక్రయాలు చేసేవారు... వాటిని ఈదుతూ నది దాటిస్తున్న దృశ్యాలు కనిపించాయి. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే సుమారు 200 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది. వ్యయ, దూర భారాలు తగ్గించుకునేందుకు నదీ మీదుగా జీవాలను ప్రమాదకరంగా తీసుకెళ్తున్నారు.
- ఇదీ చూడండి :రాజకీయరంగ ప్రవేశంపై వెనక్కి తగ్గిన రజనీకాంత్