ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తొమ్మిది శ్లోకాలకు.. తొమ్మిది నిమిషాల పాటు.. 9999 మేకులపై నృత్యం.. - నృత్యకారిణి నిఖిత

తెలంగాణలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నిర్వహించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. నవదుర్గ అంశంపై తొమ్మిది శ్లోకాలకు తొమ్మిది నిమిషాల పాటు 9,999 ఇనుప మేకులపై నృత్యకారిణి నిఖిత చేసిన నృత్యం వీక్షకులను ఆశ్చర్యపరిచింది.

Traditional dance performance
Traditional dance performance

By

Published : Mar 13, 2022, 8:01 PM IST

తొమ్మిది శ్లోకాలకు.. తొమ్మిది నిమిషాల పాటు.. 9999 మేకులపై నృత్యం..

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​ నాంపల్లిలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఇనుప మేకులపై చేసిన నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. అవని నృత్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నృత్యకారిణి నిఖిత ఈ ప్రదర్శన ఇచ్చారు. ఇందుకు నాట్యాచార్యులు డా.రవికుమార్ నిఖితకు శిక్షణ ఇచ్చారు.

నవదుర్గ అంశంపై తొమ్మిది శ్లోకాలకు తొమ్మిది నిమిషాల పాటు 9,999 ఇనుప మేకులపై నిఖిత చేసిన నృత్యం వీక్షకులను ఆశ్చర్యపరిచింది. ఈ ప్రదర్శనకు గానూ నృత్యకారిణి నిఖితకు పది అవార్డులు దక్కాయి. యువత.. మన సంప్రదాయ నృత్యాలపై ఆసక్తి చూపాలని... అప్పుడే మన సంస్కృతి భావితరాలకు అందిచగల్గుతామని నిఖిత తెలిపింది. ఈ కార్యక్రమంలో పలువురు నృత్య గురువులు, విద్యార్థులు పాల్గొన్నారు.

"నాకు చిన్నప్పటి నుంచి క్లాసికల్​ డ్యాన్స్​ అంటే చాలా ఇష్టం. డిగ్రీ కళాశాలలో లెక్చరర్​గా చేస్తూనే.. డ్యాన్స్​ ప్రాక్టిస్​ చేస్తున్నాను. ఇప్పటికే పలు చోట్ల ప్రదర్శనలిచ్చాను. మేకులపై నృత్యం చేయడానికి సుమారు మూడు నెలల పాటు ప్రాక్టిస్​ చేశాను. ప్రతీ అమ్మాయికి ఒక లక్ష్యం ఉండాలన్న విషయాన్ని మా అమ్మ నుంచి నేర్చుకున్నాను. ఇంకా మంచి మంచి ప్రదర్శనలిచ్చి మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక."- నిఖిత, నృత్యకాళాకారిణి

ఇదీ చూడండి:Suicide: సినిమా బాగోలేదని 'డై' హార్డ్ ఫ్యాన్ ఆత్మహత్య!

ABOUT THE AUTHOR

...view details