ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తిరుపతి ఉప ఎన్నికలో మా అభ్యర్థిని నిలబెడతాం' - తిరుపతి ఉప ఎన్నిక 2020 వార్తలు

అణగారిన వర్గాల ఆత్మ గౌరవ ప్రతీకగా... రాబోయే తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికలో దళిత, గిరిజన, బహుజన, మైనార్టీ వర్గాల ప్రతినిధిగా ఓ అభ్యర్థిని నిలబెడతామని మాజీ న్యాయమూర్తి, జై భీమ్ యాక్సిస్ జస్టిస్ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన దళిత సంఘాల రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు ఆయన ప్రకటించారు.

Dalit groups meeting
Dalit groups meeting

By

Published : Dec 12, 2020, 6:13 PM IST

రాష్ట్రంలో దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఖండించటం, భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ప్రణాళికలను నిర్దేశించుకోవటమే లక్ష్యంగా తిరుపతిలో దళిత సంఘాల రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన దళిత, బహుజన, గిరిజన, మైనార్టీ సంఘాల నేతలు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులను పలు సంఘాల నాయకులు ముక్త కంఠంతో ఖండించారు.

ఉప ఎన్నిక బరిలో...

మాస్కులు అడిగినా... భూములు లాక్కుంటున్నారని ప్రశ్నించినా వైకాపా నేతలు దాడులు చేస్తున్నారు. తిరుపతి ఎంపీ చనిపోతే ఆయన కుటుంబంలోని వ్యక్తులకు అవకాశం ఇవ్వని సీఎం జగన్... దళితులకు ఏం గౌరవం ఇస్తున్నారు. అందుకే అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా దళిత సంఘాల తరపున ఓ అభ్యర్థిని ఎంపీ స్థానానికి పోటీ నిలబెడుతున్నాం-శ్రావణ్ కుమార్, జై భీమ్ యాక్సిస్ జస్టిస్ అధ్యక్షుడు

వైకాపా రాకతో ఉద్రిక్తత

రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్న సమయంలో వైకాపా నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించటం ఉద్రికత్తలకు దారి తీసింది. గో బ్యాక్ శ్రావణ్ కుమార్​ అంటూ వైకాపా నాయకులు నినాదాలు చేశారు. దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. మొత్తం మీద ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ తిరుపతి వేదికగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం... దళిత సంఘాల రాజకీయ కార్యాచరణ ప్రణాళికను స్పష్టం చేసింది.

ఇదీ చదవండి

అవినీతి.. అక్రమాలే ధ్యేయంగా వైకాపా పాలన: సోము వీర్రాజు

ABOUT THE AUTHOR

...view details