ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విలయం... వాయుగుండంతో రాష్ట్రంలో విధ్వంసం - cyclone effect in andhrapradesh

భారీ వర్షాలు మిగిల్చిన భీభత్సం నుంచి.. రాష్ట్ర ప్రజలు కోలుకోలేకపోతున్నారు. ఈ నష్టం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో వాయుగుండం సృష్టించిన విలయానికి.. నిదర్శనంగా నిలుస్తున్న విషాదాలివి.

cyclone effect in andhrapradesh
cyclone effect in andhrapradesh

By

Published : Oct 15, 2020, 5:16 AM IST

ఊరూ వాడ వాన.. ప్రాణాలు గాల్లోన..

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం డి.వనిపెంట పంచాయతీ పరిధిలోని చెంచుగూడెం వెళ్లేందుకు భవనాశి వాగుపై వేసిన తాత్కాలిక వంతెన వరదకు కొట్టుకుపోయింది. దీంతో నడుంలోతు నీళ్లలో తాడును పట్టుకుని ప్రమాదకరంగా వాగును దాటుతున్న గ్రామస్థుడు. ఇలాంటి ఘటనల్లో పలువురు మృత్యువాతపడ్డారు.

పేక మేడ కాదు.. కుప్పకూలిన గూడు

ఎడతెరిపి లేన వాన.. వరదై బతుకుల్ని చిన్నాభిన్నం చేసింది. పక్కా ఇళ్లే కాదు పటిష్టమైన మేడలూ వరద ధాటికి కుప్పకూలాయనడానికి నిదర్శనం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలోని ఈ భవనం.

నీళ్లలో చేలు.. కళ్లలో నీళ్లు

తీవ్రవాయుగుండం.. రైతన్నకు గండంగా మారింది. 3 రోజులపాటు కురిసిన వర్షాలకు చేలన్నీ నడుం లోతు నీటమునిగాయి. విశాఖపట్నం జిల్లా మునగపాకలో నీటిలో నాని కుళ్లిపోతున్న వరిపైరును ఆవేదనతో చూపుతున్న ఓ రైతు.

నరకలోకపు దారులు

అసలే అంతంతమాత్రం రోడ్లు.. ఈ వర్షాలకు రాళ్లు తేలి ప్రయాణికులను భయపెడుతున్నాయి. భారీ వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు సమీపంలోని బాదంపూడి వై జంక్షన్‌ వద్ద అధ్వానంగా తయారైన జాతీయ రహదారి ఇది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో 71,821 హెక్టార్లలో పంట నష్టం: వ్యవసాయశాఖ

ABOUT THE AUTHOR

...view details