దొంగలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ద్విచక్ర వాహనాలనే కాకుండా సైకిళ్లను సైతం వదలట్లేదు. తెలంగాణ మేడ్చల్ జిల్లా గాజులరామారంలో ఇద్దరు వ్యక్తులు సైకిల్ ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
సైకిల్ చోరీ.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు - మేడ్చల్ జిల్లాలో సైకిల్ దొంగలు
చోరీకీ కాదేదీ అనర్హం అన్న రీతిలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇదివరకు బైక్‌ల చోరీలు మాత్రమే చూశాం. కానీ సైకిళ్లను సైతం చోరులు వదలడం లేదు. తెలంగాణ మేడ్చల్ జిల్లా గాజులరామారంలో ఇద్దరు వ్యక్తులు సైకిల్ దొంగతనం చేస్తూ సీసీ కెమెరాకు చిక్కారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సైకిల్ చోరీ.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు
స్థానిక దేవేందర్‌నగర్‌లో అర్ధరాత్రి ఇద్దరు దొంగలు సైకిల్‌పై వచ్చారు. వీధుల్లో తిరుగుతూ హన్మంత్ అనే వ్యక్తి సైకిల్‌ను దొంగిలించారు. ఈ దృశ్యం సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.