రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రాజకీయ నేతలు, రాజకీయేతర ఐకాస ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహించారు. గుంటూరు మదర్ థెరిసా విగ్రహం నుంచి తుళ్లూరు వరకు నిర్వహించిన ఈ యాత్రలో న్యాయవాదులు, వైద్యులు, విద్యార్థులు, ఆడిటర్లు, పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 'మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు' అంటూ నినాదాలు చేశారు. అమరావతి కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు, రైతులపై అన్యాయంగా కేసులు నమోదు చేయడం దారుణమని ఐకాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానాల నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అమరావతి కోసం సైకిల్ యాత్ర - గుంటూరు నుంచి తుళ్లూరుకు సైకిల్ యాత్ర
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రాజకీయ నేతల, రాజకీయేతర ఐకాస ఆధ్వర్యంలో.. గుంటూరు నుంచి తుళ్లూరుకు సైకిల్ యాత్ర నిర్వహించారు. మూడు రాజధానాల నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
గుంటూరు నుంచి తుళ్లూరుకు సైకిల్ యాత్ర