'పీవీ సోలార్ అప్లికేషన్స్'(pv solar applications) పేరిట ఓ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. మొబైల్ నంబర్, ఖాతా వివరాలుంటే చాలూ.. ఎవరైనా ఇందులో సభ్యత్వం తీసుకోవచ్ఛు ఇందులో రూ.10వేల మొదలు రూ.5 లక్షల వరకు వివిధ కేటగిరీలున్నాయి. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్టర్ అయ్యి మన స్థోమతను బట్టి కేటగిరీని ఎంపిక చేసుకోవాలి. ఫోన్‌పే(phonepe), గూగుల్‌పే(Google Pay), పేటీఎం(Paytm) తదితర యాప్‌ల ద్వారా డబ్బులను చెల్లించాలి. ఆ తర్వాత పెట్టుబడికి అనుగుణంగా లాభాలు ఖాతాల్లో జమ అయ్యాయి. ఇలా మొదట్లో కొన్ని రోజులు అంతా బాగానే నడిచింది. ఆ నోటా.. ఈ నోటా చాలా మంది పెట్టుబడులు పెట్టారు. వీరిలో ఎక్కువగా ఐటీ కారిడార్‌లోని ప్రైవేట్ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు, నిరుద్యోగులు ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఎలా బయటపడిందంటే..