Kaun Banega Crorepati fraud in Telangana : 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమం కింద రూ.25 లక్షలు గెలిచావంటూ సందేశం పంపాడు. ఈ డబ్బు చెల్లించాలంటే దిల్లీ సీఎం అప్రూవల్ ఛార్జీలు, సీబీఐ ఛార్జీలు చెల్లించాలంటూ ఓ వ్యక్తిని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు.. నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.3.03 లక్షలు కొట్టేశారు. దీనిపై బాధితుడు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు ప్రారంభించారు. నగరంలోని సూరారంలో ఉండే వ్యక్తి(27)కి ఆగస్టు 15న వాట్సాప్‌లో సందేశం వచ్చింది. కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) పేరిట రూ.25 లక్షలు గెలిచావంటూ బ్రోచర్ పంపారు. అనంతరం రాణా ప్రతాప్ సింగ్ పేరిట ఫోన్ చేసిన సైబర్ నేరగాడు కేబీసీలో గెలిచిన డబ్బు పొందాలంటే కిరణ్ కుమార్ శర్మకు ఫోన్ చేయాలంటూ నంబరు ఇచ్చాడు.
Kaun Banega Crorepati కేబీసీ పేరిట మోసం.. దిల్లీ సీఎం సరేనంటే రూ.25 లక్షలు నీకేనంటూ..! - Ap latest news
Kaun Banega Crorepati fraud in Telangana : సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజూ ఏదో ఓ మూల సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి జనం మోసపోతూనే ఉన్నారు. ఇదివరకు ఉద్యోగాలు, బహుమతి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అంటూ సందేశాలు పంపి డబ్బులు కొట్టేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం పేరు చెప్పి జేబులు గుళ్ల చేస్తున్నారు.
fraud in the name of Kaun Banega Crorepati : నమ్మిన బాధితుడు ఆ నంబరుకు ఫోన్ చేయగా.. బ్యాంకు ఖాతా, ఇతర వివరాలు పంపాలని సూచించాడు. డబ్బు చెల్లించాలంటే దిల్లీ ముఖ్యమంత్రి అప్రూవల్ ఛార్జీ, సీబీఐ ఛార్జీ, డాక్యుమెంటేషన్, రవాణా, ఎన్‌వోసీ, ఎల్‌ఐసీ పాలసీ ఖాతా సహా కొన్ని రకాల రుసుములు చెల్లించాలని చెప్పాడు. దీంతో బాధితుడు.. గౌరవ్ కుమార్, శరద్ సింగ్, రాహుల్, కిషన్ లాల్ మోహిత్ జీ, మహ్మద్ అనస్ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలకు తన మిత్రుల ద్వారా మొత్తం రూ.3.03 లక్షలు పంపాడు. మరోసారి నిందితుడు ఫోన్ చేసి రూ.25 లక్షల పెద్ద మొత్తం ఉన్నందున భద్రత(సెక్యూరిటీ పర్పస్) కోసమంటూ మరో రూ.31 వేలు పంపాలని కోరాడు. పదే పదే డబ్బు అడగడంతో అనుమానం వచ్చిన బాధితుడు మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇటీవల కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: