ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి వద్ద నుంచి లక్ష రూపాయలు దోచేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. తాను ఇబ్బందుల్లో ఉన్నానని వెంటనే లక్ష రూపాయలు అకౌంట్లో జమ చేయాలని ఆర్మీ జవాన్ రాములుకి తన స్నేహితుడి ఫేస్బుక్ అకౌంట్ నుంచి మెసేజ్ వచ్చింది. వెంటనే ఆ అకౌంట్‌కి లక్ష రూపాయలను ఆర్మీ జవాన్ బదిలీ చేశారు. డబ్బులు అకౌంట్లో వేశానని తన స్నేహితుడికి జవాన్ కాల్ చేసి చెప్పారు. తాను డబ్బులు అడగలేదని రాములుకు స్నేహితుడు బదులిచ్చారు. కంగుతిన్న జవాన్... హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేసి రూ.లక్ష దోచేశారు! - ఆర్మీ జవాన్
హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఫేస్బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన నిందితులు.. అతని స్నేహితుణ్ని మోసం చేసి లక్ష కాజేశారు. బాధితుడు ఆర్మీ జవాన్.
cyber-criminals-cheated-and-looted-rs-dot-lakh-in-the-name-of-jawan-friend-in-hyderabad