తెలంగాణలో మద్యం దుకాణాలు తెరుచుకుంటాయంటూ ఎక్సైజ్ శాఖ పేరుతో నకిలీ జీవోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన ఐదుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నాంపల్లి అఘాపురాకి చెందిన అనూశ్ కుమార్, బషీర్బాగ్కి చెందిన హనుమాన్ రాజులతో పాటు మరో ముగ్గురికి నోటీసులు అందజేశారు. వీరితో పాటు సోషల్ మీడియాలో వైరల్ చేసిన మరికొంత మందిని పోలీసులు గుర్తించారు.
తెలంగాణ: వైన్స్ దుకాణాలు కాదు.. ఛార్జీషీట్లు ఓపెన్ చేశారు - latest news on corona in telengana
తెలంగాణలో వైన్స్ దుకాణాలు తెరుచుకుంటాయంటూ సోషల్ మీడియాలో నకిలీ జీవోను వైరల్ చేసిన ఐదుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేశారు.
![తెలంగాణ: వైన్స్ దుకాణాలు కాదు.. ఛార్జీషీట్లు ఓపెన్ చేశారు wine shop praopagation in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6605603-419-6605603-1585637027257.jpg)
తెలంగాణలో వైన్ షాపులు తెరవడంపై అసత్య ప్రచారం