తన కుటుంబ సభ్యులకు చెందిన పాస్‌పోర్టుల పునరుద్ధరణ కోసం తెలంగాణలోని బాచుపల్లి..మల్లంపేట్‌కు చెందిన మహిళ(44) ఆన్‌లైన్ (FAKE WEBSITES)లో దరఖాస్తు చేసింది. బ్యాంక్ ఖాతా నుంచి రూ.8,485 డెబిట్ అయ్యాయి. ఎలాంటి రశీదు రాలేదు. స్లాట్ బుక్ అయినట్లు కూడా సమాచారం రాకపోవడంతో అనుమానమొచ్చి దుండిగల్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆరా తీయగా అది నకిలీ ‘పాస్‌పోర్టు’ వెబ్‌సైట్ (FAKE WEBSITES) అని తేలింది. ఇదొక్కటే కాదు.. ఇలాంటి నకిలీ వెబ్‌సైట్లు (FAKE WEBSITES) వందల్లో ఉన్నట్లు సైబరాబాద్, రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
నిరుద్యోగులే లక్ష్యంగా..
అసలు వెబ్‌సైట్ల మాదిరిగానే స్వల్ప మార్పులు చేసి నకిలీ వెబ్‌సైట్ల (FAKE WEBSITES)ను తయారు చేస్తున్నారు. జాగ్రత్తగా గమనిస్తే తప్ప తేడా గుర్తించలేం. ఈ తరహా నకిలీ వెబ్‌సైట్లతో మొదట్లో నిరుద్యోగులకు టోకరా వేయడం మొదలు పెట్టారు. నౌకరీలైవ్.కామ్, నౌకరీఇండియా.కామ్, నౌకరీస్.కామ్, షైన్‌లైవ్.కామ్, షైన్‌ఇండియా.కామ్ పేరిట నకిలీ వెబ్‌సైట్ల (FAKE WEBSITES)ను సృష్టించి.. ఆ లింక్‌ను నిరుద్యోగులకు పంపుతున్నారు. కొందరేమో బ్యాంక్ ఖాతా వివరాలిచ్చి.. అందులో ప్రాసెసింగ్ ఫీజు, ఇతరత్రా ఛార్జీలను జమ చేయాలని సూచిస్తున్నారు. ఇంకొందరేమో రూ.11 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటున్నారు. అక్కడే పోర్టల్‌లోనే ఓటీపీ సాయంతో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు, మూడు సార్లు లావాదేవీలు ఫెయిల్ అయినట్లు వస్తుంది. ఆ తర్వాత ఖాతాలో ఉన్న డబ్బంతా మాయమవుతుందని పోలీసులు వివరిస్తున్నారు.
ఆఫర్లే.. ఆఫర్లు అంటూ..
కరోనాతో ఎక్కువ మంది నిత్యావసర వస్తువులను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కేటుగాళ్లు తదితర ప్రాచుర్యం పొందిన ఈ-కామర్స్ వెబ్‌సైట్ల (FAKE WEBSITES)కు నకిలీవి రూపొందించి ఆన్‌లైన్‌లో పెట్టేశారు. మార్కెట్ ధరతో పోల్చితే 50 శాతం తక్కువకు ఇస్తామంటూ.. విస్తృతంగా ప్రకటనలిస్తున్నారు. డబ్బులు చెల్లించిన తర్వాత వస్తువులు డెలీవరీ చేయడం లేదు. అప్పుడు మోసపోయినట్లు తెలుసుకుని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఈ తరహాలోనే ‘డెక్‌అప్.కామ్’, ‘జాప్‌నౌ.ఇన్’ ‘మాడ్‌వేఫర్నీచర్.కో.ఇన్’ పేరిట నకిలీ వెబ్‌సైట్ల (FAKE WEBSITES)ను రూపొందించి నిండా ముంచుతున్న రిషభ్ ఉపాధ్యాయ్(30)ని ఇటీవల సైబరాబాద్ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు.
ఎక్కడి నుంచి చేస్తున్నారంటే...
ఈ-కామర్స్, రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ల (FAKE WEBSITES)కే పరిమితం కాలేదు. ముఖ్యంగా పాస్‌పోర్టు సేవలు, విద్యుత్తు బిల్లుల చెల్లింపునకు సంబంధించి పదుల సంఖ్యలో నకిలీ వెబ్‌సైట్లు (FAKE WEBSITES) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దిల్లీ, నోయిడా, గుడ్‌గావ్ తదితర ప్రాంతాల నుంచే ఇలాంటి తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. అక్కడ నేరగాళ్లు వివిధ పేర్లతో కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. లోపలికెళ్లే వరకు కూడా అది కాల్ సెంటర్ అని ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులకు చిక్కకుండా ఒకటి, రెండు నెలలకోసారి అక్కడి నుంచి మకాం మారుస్తున్నారు.
50 శాతం చెల్లించాలంటూ..