ఓఎల్‌ఎక్స్‌లో తక్కువ ధరకే టూ వీలర్ వాహనాల అమ్మకం అన్నఫొటోలు చూసి సంప్రదించిన తెలంగాణలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను సైబర్ నేరగాళ్లు నిండా ముంచేశారు. వాహనం కావాలంటే ముందుగానే డబ్బులు చెల్లించాలని షరతు పెట్టి.. చివరికి పంగనామం పెట్టారు. మోసాన్ని గ్రహించలేని బాధితులు ఆన్లైన్ ద్వారా రూ. 1.50 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. వాహనం రాకపోవడం వల్ల సంబంధిత నెంబర్‌ను సంప్రదించగా స్పందన లేదు. ఫలితంగా మోసపోయామని గ్రహించిన బాధితులు హైదరాబాద్ సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ఓఎల్‌ఎక్స్‌లో ఫొటోలు పెట్టి... రూ.లక్ష దండుకున్నారు - ఓఎల్ఎక్స్ పేరుతో సైబర్ మోసం వార్తలు
సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుంటూ.. దోపిడీలకు పాల్పడుతున్నారు. వీరి ఉచ్చులో చిక్కుకుని మోసపోతున్న బాధితులు లక్షలు సమర్పించుకుంటున్నారు. తాజాగా ఓఎల్‌ఎక్స్‌లో తక్కువ ధరకే ద్విచక్ర వాహనాలు అమ్ముతామంటూ కేటుగాళ్లు ముగ్గురిని బురిడీ కొట్టించారు. లక్షల సొమ్ము కాజేశారు.
![ఓఎల్‌ఎక్స్‌లో ఫొటోలు పెట్టి... రూ.లక్ష దండుకున్నారు cyber-cheating-at-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7827434-425-7827434-1593494609202.jpg)
సైబర్ నేరగాళ్లు.. సొమ్మును దోచేస్తున్నారు
మరో రెండు కేసుల్లో ఓటీపీ పేరుతో ఇద్దరు వ్యక్తుల అకౌంట్ నుంచి 1.30 లక్షలు, లోన్ పేరుతో ఓ వ్యక్తి నుంచి రూ.55 వేలు కాజేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3 కేసులపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
ఇదీచూడండి: అనవసర సైట్లు ఓపెన్ చేస్తే అంతే.. : ఏసీపీ హరినాథ్