ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లేడీ డాక్టర్​ పేరుతో లవ్​ ప్రపోజల్​.. 24 లక్షలు ఖల్లాస్

సైబర్​ నేరగాళ్లు రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం పెంచుకొని ప్రేమ పేరుతో వలపు వల విసిరి నిలువునా దోచేస్తున్నారు. ఆన్​లైన్​ ట్రేడింగ్​ ఆశ చూపి అమాయకుల ఖాతాలను కొల్లగొడుతున్నారు. తాజాగా హైదరాబాద్​కు చెందిన ఇద్దరు వ్యక్తులు వారి ఉచ్చులో చిక్కుకున్నారు.

cyber crime news
cyber crime news

By

Published : Jun 11, 2021, 4:25 PM IST

ఫేస్​బుక్​లో అమ్మాయిల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి సైబర్​ నేరగాళ్లు వరుస మోసాలకు పాల్పడుతున్నారు. లేడీ డాక్టర్​ అవతారమెత్తిన ఓ సైబర్​ మోసగాడు.. ఎఫ్​బీలో ఫ్రెండ్​ రిక్వస్ట్​ పెట్టి ఓ వైద్యుడికి పరిచయమయ్యాడు. ప్రేమ పేరుతో వల విసిరాడు. అనంతరం విలువైన గిఫ్ట్ పంపిస్తామని కేటుగాళ్లు నమ్మించారు. దిల్లీ ఎయిర్ పోర్టు నుంచి కస్టమ్స్​ అధికారులమంటూ ఫోన్ చేశారు. కస్టమ్, ఇతర ఛార్జీల పేరుతో అతని ద్వారా రూ. 24 లక్షలు అకౌంట్​లో జమ చేయించుకున్నారు. చివరికి అసలు విషయం తెలిసి బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

మరో కేసులో ఆన్​లైన్​ ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలు ఇస్తామని చెప్పి హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ. 43 లక్షలు సైబర్​ కేటుగాళ్లు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు సంఘటనల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:Jagan Delhi Tour: 'పౌరసరఫరాల శాఖకు రూ.2,339 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి'

ABOUT THE AUTHOR

...view details