మాస్కులు, శానిటైజర్ల పేరుతో సైబర్ నేరాగాళ్లు రూ. 24 లక్షల మేరకు మోసం చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు లాక్డౌన్ సమయంలో మాస్కులు, శానిటైజర్ల కోసం ఆన్లైన్లో వెతికారు. సైబర్ నేరగాళ్లు తమది కెనడాకు చెందిన కంపెనీ అని... మాస్కులు, శానిటైజర్లు సప్లై చేస్తామని చెప్పారు. ఇది నమ్మిన నిర్వాహకులు విడతల వారీగా రూ.24 లక్షలు చెల్లించారు.
తెలంగాణ: మాస్కులు, శానిటైజర్ల పేరుతో రూ.24 లక్షల మోసం - మాస్కుల మోసాలు
సైబర్ నేరాలు ఎన్ని జరిగినా కొంతమంది మోసపోతూనే ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ట్రస్ట్ నిర్వాహకులు లాక్డౌన్ సమయంలో మాస్కులు, శానిటైజర్ల కోసం ఆన్లైన్లో 24 లక్షల రూపాయలు చెల్లించి మోసపోయారు. చివరికి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు నిందితుడిని పట్టుకున్నారు.
cyber crime
అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో మోసపోయామని తెలుసుకున్న ట్రస్ట్ ప్రతినిధి మోజో... హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆగస్టులో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ తరహా కేసులో బెంజిమెన్ అనే నైజీరియన్‌ను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు.. విచారించగా హైదరాబాద్ కేసులో బెంజిమెన్ నిందితుడిగా ఉన్నాడని తేలింది. నిందితుడిని పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు.
ఇదీ చదవండి:'ఇదేనా రైతుకు మీరిస్తోన్న మద్దతు..'