జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రస్తుతం 32 పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. 2020-21 సంవత్సరానికి కేంద్రం ఇచ్చిన 2,400 కోట్ల రూపాయల నిధుల్లో 92 శాతం ఖర్చుపెట్టి... మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీ ముందంజలో ఉందని వెల్లడించారు.
రాష్ట్రంలోని జాయింట్ కలెక్టర్లతో పథకాలపై అమలు తీరుపై ఒక్కరోజు వర్క్ షాపును నిర్వహించారు. మాతా శిశు మరణాలను తగ్గించాలని, దీర్ఘకాలిక వ్యాధులను నియత్రించాలని జేసీలను ఆదేశించారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా స్థానికంగా ఉండే పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలందించాలని చెప్పారు.