తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి కర్ఫ్యూ విధిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ ఉంటుందని స్పష్టం చేశారు. దుకాణాలు సాయంత్రం 6 గంటలకే బంద్ చేయాలని ఆదేశించారు. ఒక్క మనిషి కూడా రోడ్డు మీదికి రావద్దన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే డయల్ 100కు ఫోన్ చేస్తే సహాయం చేస్తారని చెప్పారు. గ్రామాల్లో వ్యవసాయ పనులకు ప్రభుత్వం అనుమతి ఉందన్నారు.
'సహకరించండి... లేకపోతే 24 గంటల కర్ఫ్యూ ఉంటుంది' - Covid-19 latest updates
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ ఉంటుందని స్పష్టం చేశారు.
curfew-in-telangana-cm-kcr
తమ గ్రామాలకు రావద్దని కొందరు కంచెలు వేస్తున్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. నాలుగు రోజులు జాగ్రత్తగా ఉంటే రాష్ట్రాన్ని కాపాడుకున్న వాళ్లం అవుతామని కేసీఆర్ పేర్కొన్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కొంత మంది వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవాలని సూచించారు. ప్రజలు వినకపోతే పెట్రోల్ బంకులూ మూయాల్సి వస్తుందని హెచ్చరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయని వివరించారు.
ఇదీ చూడండి:మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము