ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Golden Tips Black Tea Powder: కప్పు టీ ధర వెయ్యి రూపాయలు.. అదీ హైదరాబాద్‌లో! - హైదరాబాద్​లో కేఫ్​లు

సాధారణంగా టీ ధర ఎంత ఉంటుందంటే పది రూపాయలని టక్కున చెప్తాం. ఖరీదైన కేఫ్‌ల్లో అయితే.. వెరైటీని బట్టి టీ ధర వందల్లోనూ ఉంటుంది. కానీ, తాజాగా హైదరాబాద్‌లోని ఓ కేఫ్‌ కప్పు టీని రూ. వెయ్యికి విక్రయిస్తోంది. కప్పు టీ (Golden Tips Black Tea Powder)కి అంత ధర అని ఆశ్చర్యపోతున్నారా? అది అరుదైన టీ పౌడర్‌ (Golden Tips Black Tea Powder)తో తయారు చేస్తోన్న టీ అండి మరి..!

tea
tea

By

Published : Oct 16, 2021, 10:21 AM IST

నీలోఫర్‌ కేఫ్.. హైదరాబాదీలకు సుపరిచితమైన చోటే. ఇక్కడ అనేక రకాల టీలు, బిస్కెట్స్‌ను విక్రయిస్తుంటారు. కాగా.. ఇప్పుడు బంజారాహిల్స్‌లోని కేఫ్‌ బ్రాంచ్‌లో ప్రత్యేకమైన, ఖరీదైన టీని పరిచయం చేస్తున్నారు. ఈ టీని గోల్డెన్‌ టిప్స్‌ బ్లాక్‌ టీ పౌడర్‌ (Golden Tips Black Tea Powder)తో తయారు చేస్తారట. ఈ అరుదైన టీ పౌడర్‌ను కేఫ్‌ యాజమాన్యం వేలంలోపాటలో గెలుచుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కేజీన్నర గోల్డెన్‌ టిప్స్‌ బ్లాక్‌ టీ పౌడర్‌ (Golden Tips Black Tea Powder)ను అసోంలో నిర్వహించిన వేలంలో కేజీ రూ.75వేల చొప్పున కొనుగోలు చేశారు.

ప్రత్యేకమైన, అరుదైన రుచిని కస్టమర్లు ఆస్వాదించాలనే ఉద్దేశంతోనే ఈ టీని పరిచయం చేస్తున్నామని కేఫ్‌ యాజమాన్యం చెబుతోంది. మీకు ఆ టీ రుచి చూడాలని ఉందా..? మరెందుకు ఆలస్యం ఈ స్పెషల్‌ టీ ఆఫర్‌ ముగియకముందే వెళ్లి తాగేయండి.

ఆ తేయాకు.. కిలో రూ.12,500..
త్రిపురలో నాణ్యమైన, ఖరీదైన తేయాకుగా పేరుగాంచిన 'నీర్ మహాల్ టీ'.. త్వరలో డెన్మార్క్​కు​ ఎగుమతి కానుంది. ఈ తేయాకును డెన్మార్క్​కు ఎగుమతి చేసేందుకు అమ్రిత్​సర్​కు చెందిన షాహ్​జాదా ఎక్స్​పోర్ట్​ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. దీని ధర కిలో రూ. 12,500 కాగా.. రూ. 65 వేలకు ఐదు కిలోలను కొనుగోలు చేసినట్లు త్రిపుర టీ బోర్డు కార్పొరేషన్‌ ‌డైరెక్టర్ దిగంత బర్మాన్ తెలిపారు. ఈ రకం.. టీ ఆకులు ఇంత భారీ ధర పలకడం ఇదే తొలిసారని.. చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్​లోకి వెళ్లే సామర్థ్యం ఈ తేయాకుకు ఉందన్నారు.

సంప్రదాయ పద్ధతిలో..
త్రిపురలోని 'నీర్ మహాల్ టీ'కి అంత డిమాండ్​ ఉండటానికి కారణం.. ఈ తేయాకును సంప్రదాయ పద్ధతిలో చేతితోనే చేస్తారు. టీ ఆకులను చెట్టునుంచి కోసిన తర్వాత.. చేతితో నలిపి ఎండబెడతారు. ఈ సంప్రదాయ తేయాకును త్రిపుర ఉన్నకోటి జిల్లా కైలాష్నహార్​.. పంచమ్​ నగర్​ టీ ఫ్యాక్టరీలో తయారుచేస్తారు.

ఇదీ చూడండి: 'క్యారెట్ రసం'తో కాలేయం పదిలం

ABOUT THE AUTHOR

...view details