సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్‌ఆర్ నవశకం పేరుతో ఈనెల 20 నుంచి డిసెంబర్ 20 వరకూ గ్రామ, వార్డు వాలంటీర్లతో ఇంటింటా సర్వే చేయించాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. గురువారం సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె... తొలిసారి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల వివరాలను క్షేత్రస్థాయిలో అందరికీ చేరవేయాలని స్పష్టం చేశారు. నూతన బియ్యం, వైఎస్ఆర్ పింఛన్ కానుక, ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కార్డుల పంపిణీకి లబ్ధిదారుల గుర్తింపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాధాన్యతా అంశాలపై మార్గనిర్దేశం చేశారు.
'వైఎస్ఆర్ నవశకం పేరుతో ఇంటింటి సర్వే' - సీఎస్ నీలం సాహ్ని వీడియోకాన్ఫరెన్స్ తాజా వార్తలు
సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, విభాగ అధిపతులతో మాట్లాడారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు, ప్రాధాన్యతా అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 20 నుంచి డిసెంబర్ 20 వరకు సర్వేకు ఆదేశాలు జారీచేశారు. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటా సర్వే చేయాలని తెలిపారు.
cs
Last Updated : Nov 15, 2019, 3:13 PM IST