ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 1, 2019, 6:36 PM IST

ETV Bharat / city

ఆహార పదార్థాలకు ప్రతిరోజూ పరీక్ష..!

పబ్లిక్ హెల్త్ చట్టాన్ని తప్పక పాటించేందుకు చర్యలు తీసుకోవాలని... సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అధికారులను ఆదేశించారు. బయట విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను నిత్యం పరీక్షించాలని సూచించారు.

సీఎస్

ప్రాథమిక ఆరోగ్య సేవల పటిష్ఠంపై సుజాతారావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సూచించిన... సిఫార్సుల గురించి సచివాలయంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్షించారు. కమిటీ చేసిన సిఫార్సుల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. హోటళ్లు, ఫుడ్ ఎస్టాబ్లిష్​మెంట్​లలో... ఆహార పదార్థాల నమూనాలు రోజూ పరీక్షించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటి నీటి నమూనాలూ సేకరించి పరీక్షించాలని సూచించారు. పబ్లిక్ హెల్త్ చట్టాన్ని తప్పక పాటించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సుజాతారావు, వైద్యారోగ్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, పురపాలకశాఖ కార్యదర్శి, అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details