TS CS Somesh Review PM Tour: శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన దృష్ట్యా.. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు నిర్దేశించారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం సహా రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరంలో సమతామూర్తి విగ్రహావిష్కరణ కోసం ప్రధానమంత్రి ఎల్లుండి హైదరాబాద్ రానున్నారు. ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.
మోదీ పర్యటన ఇలా..
''పటాన్చెరు సమీపంలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం ముచ్చింతల్‌కు వెళ్తారు. అక్కడ రామానుజచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమతామూర్తి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రాత్రికి తిరిగి దిల్లీ బయల్దేరి వెళ్తారు.''