తిరుపతిలో జరుగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ..... వివిధ శాఖల కార్యదర్శులను, చిత్తూరు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. నవంబర్ 14న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో సమావేశం జరుగనుంది. ఈ కార్యక్రమానికి 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్‌లు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు.
CS REVIEW: జోనల్ కౌన్సిల్ సమావేశ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష - CS Sameer Sharma latest news
తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ ఏర్పాట్లపై.. వివిధ శాఖల కార్యదర్శులతో సీఎస్ సమీర్ శర్మ సమీక్ష నిర్వహించారు. కౌన్సిల్ భేటీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.
![CS REVIEW: జోనల్ కౌన్సిల్ సమావేశ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష సీఎస్ సమీర్ శర్మ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13484520-79-13484520-1635427928787.jpg)
సీఎస్ సమీర్ శర్మ
జోనల్ కౌన్సిల్ సమావేశ ఏర్పాట్లపై ఏపీ సచివాలయంలో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు... సభ్యులుగాను, అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీవులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ సమావేశంలో పాల్గొంటాయని తెలిపారు. రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన సాయం గురించి ఈ సమావేశంలో చర్చించనున్నటు తెలిపారు
ఇదీ చదవండి:
అప్పటి వరకు దేశమంతా ఆంక్షలు: కేంద్రం కీలక ప్రకటన
Last Updated : Oct 29, 2021, 2:45 AM IST