ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రపతి పర్యటనపై సీఎస్ సమీక్ష - మదనపల్లెలో పర్యటించనున్న రాష్ట్రపతి రామ్​నాధ్ కోవింద్

ఈ నెల 7న చిత్తూరు జిల్లా మదనపల్లె రానున్న రాష్ట్రపతి కోవింద్‌ పర్యటనపై సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌ సమీక్ష నిర్వహించారు. పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.

CS Review On President Tour
రాష్ట్రపతి పర్యటనపై సీఎస్ సమీక్ష

By

Published : Feb 2, 2021, 10:19 PM IST

రాష్ట్రపతి రామ్​నాధ్ కోవింద్ ఈనెల 7వతేదీన చిత్తూరు జిల్లా మదనపల్లెలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

రాష్ట్రపతి 7వతేదీ మధ్యాహ్నం చిత్తూరు జిల్లా మదనపల్లెకు చేరుకుని సత్సంగ్ ఫౌండేషన్ ఆశ్రమాన్ని సందర్శించి.... అక్కడ యోగశాల, భారత్ యోగ విద్యాకేంద్రాన్నిప్రారంభించనున్నారని సీఎస్ తెలిపారు. అలాగే 38 పడకల స్వస్థ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని స్పష్టం చేశారు. తదుపరి సాడమ్ చేరుకుని అక్కడ పీపాల్ గ్రోవ్ పాఠశాలను సందర్శించి విద్యార్ధులతో ముచ్చటించనున్నారని పేర్కొన్నారు. రాష్ట్రపతి పర్యటనలో గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు పాల్గొనున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details