దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న వివిధ గృహ నిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధికి సంబధించి రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 25 లక్షల మందికి ఇళ్లను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని సీఎస్ తెలిపారు. పేదలు సొంతంగా చేపట్టే ఇంటి నిర్మాణాన్ని 40 రోజుల్లో గానే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణ శాఖ అధికారులకు సూచించారు. పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రస్తుతం 6 లక్షల ఇళ్లు వివిధ దశల్లో... నిర్మాణంలో ఉన్నాయని సీఎస్‌కు గృహనిర్మాణశాఖ కార్యదర్శి అజయ్ జైన్ వివరించారు. వచ్చే మార్చి నాటికి అన్ని నిర్మాణాలూ పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని సీఎస్ స్పష్టం చేశారు.
'అపరిష్కృత గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయండి' - cs review meetings on housing projects
రాష్ట్రంలో అపరిష్కృత గృహనిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధికి సంబంధించి రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే మార్చి నాటికి అన్ని నిర్మాణాలు పూర్తి కావాలని స్పష్టం చేశారు.
సీఎస్ సమీక్ష
Last Updated : Oct 16, 2019, 3:37 AM IST