వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమంపై సచివాలయంలో సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్యశాఖలో అమలు చేస్తున్న పథకాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు.. నాడు- నేడు కింద చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు గిరిజన ప్రాంతాల్లో వైద్యానికి సంబంధించి మౌలిక సదుపాయలు తప్పనిసరిగా ఉండేలా చూడాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయలు తప్పనిసరి:సీఎస్ - వైద్యారోగ్య శాఖపై సీఎస్ నీలం సాహ్ని సమీక్ష న్యూస్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించడంపై దృష్టి పెట్టాలని సీఎస్ నీలం సాహ్ని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యానికి సంబంధించిన మౌలిక సదుపాయలపై ఆరా తీశారు.

గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయలు తప్పనిసరి:సీఎస్