రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించి జెండా వందనం చేసే మంత్రుల పేర్లను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేస్తారని స్పష్టం చేసింది. ఆగస్టు 15 తేదీన సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉదయం 7.30 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జెండా వందనం చేయనున్నారు. ఈ మేరకు సచివాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశారు.
సచివాలయంలో జెండా వందనం చేయనున్న సీఎస్ నీలం సాహ్ని
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే జిల్లాల్లో జెండా వందనం చేసే మంత్రుల పేర్లను ప్రకటించింది. ఇక రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జెండా వందనం చేస్తారని తెలిపింది.
cs neelam sahni