పట్టణ, నగరాల్లోని మురికివాడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కలెక్టర్లకు సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి మురికివాడకు, జనసమర్థత అధికంగా ఉన్నచోట్ల ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు కోనుగోలు చేసేందుకు ప్రజలు అధికంగా గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
దాతలు ఈ విషయాన్ని తప్పక పాటించాలి: సీఎస్ - సీఎస్ నీలం సాహ్ని తాజా వార్తలు
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరూ విధిగా భౌతిక దూరాన్ని పాటించాలని సీఎస్ నీలం సాహ్ని ఉద్ఘాటించారు. ముఖ్యంగా పేద ప్రజలకు సాయం అందిచే దాతలు ఈ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
జిల్లాల్లో గ్రీన్ జోన్లు, ఇతర ప్రాంతాల్లో వివిధ వస్తువులను పంపిణీ చేసే దాతలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా రెడ్ జోన్ ప్రాంతాల్లో కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువులు మొబైల్ వాహనాలు ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయాలని సూచించారు. నాల్గో విడత ఇంటింటి సర్వే నిర్వహణకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు సీఎస్ వివరించారు. ఆ సర్వేలో ప్రధానంగా 60 ఏళ్ల పైబడిన వ్యక్తులు, కోమార్బీడిటీ లక్షణాలు ఉన్న వారిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి వారి వివరాలను సేకరించాలని ఆదేశించారు.
ఇదీ చదవండీ... వికేంద్రీకరించిన రైతుబజార్లను కొనసాగించాలి: సీఎం జగన్