ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చొరవ చూపండి' - CS Neelam Sahni latest news

ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు(ఏపీడీఆర్పీ)కింద శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో 6 కాంపొనెంట్ల కింద చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ఏపీ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై సమావేశం నిర్వహించారు.

CS Neelam Sahni Review on APDRP
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని

By

Published : Feb 19, 2020, 11:48 PM IST

ఏపీ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు కింద ఇప్పటికే మంజూరు చేసిన పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎస్ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. ఇంకా చేపట్టాల్సిన పనులకు వెంటనే టెండర్లు పిలవాలని అధికారులకు సూచించారు. ఏపీడీఆర్పీ కింద ప్రపంచ బ్యాంకు 68 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 32 శాతం నిధులు మొత్తం 2 వేల 71 కోట్ల వ్యయంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పనులు చేపట్టాలని చెప్పారు. వాటిని ఐదేళ్లలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏపీఈపీడీసీఎల్, పీఆర్అండ్ఈడీ, ఆర్​అండ్​బీ, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, ఏపీ ఫారెస్ట్, ఫైర్ సర్వీసెస్ విభాగాల్లో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎస్ నీలం సాహ్ని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details