రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. ఎన్నికలు యథావిధిగా నిర్వహించడానికి కార్యాచరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని... పరిస్థితి అదుపులోనే ఉందని లేఖలో తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి లేకుండా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టవచ్చని సూచించారు. జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చని అన్నారు. మరో 3, 4 వారాలపాటు కరోనా నియంత్రణలోనే ఉంటుందని లేఖలో పేర్కొన్నారు సీఎస్.
ఎన్నికలు నిర్వహించండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సీఎస్ లేఖ - ఈసీకి సీఎస్ లేఖ వార్తలు
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని...స్థానిక సంస్థల ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సీఎస్ నీలం సాహ్ని ..రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. మరో 3, 4 వారాలపాటు కరోనా నియంత్రణలోనే ఉంటుందని లేఖలో పేర్కొన్నారు సీఎస్.
cs neelam letter to ec for local body elections
ఇవీ చదవండి: రాష్ట్రంలో 28కి చేరిన కరోనా అనుమానితులు
Last Updated : Mar 16, 2020, 10:13 AM IST