cs react prc: ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి కమిటీ చేసిన సిఫార్సులపై ముఖ్యమంత్రి మూడు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ వెల్లడించారు. 11వ వేతన సంఘం సిఫార్సులపై ఏర్పాటైన సీఎస్ కమిటీ సోమవారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి నివేదిక అందజేసింది. అనంతరం సచివాలయంలో సీఎస్ విలేకరులతో మాట్లాడారు. ‘ఫిట్‌మెంట్‌పై ముఖ్యమంత్రికి 11 ప్రతిపాదనలు ఇచ్చాం. ఇతర రాష్ట్రాలు, కేంద్రం ఇచ్చిన నివేదికలు పరిశీలించాం. పీఆర్‌సీ, ఫిట్‌మెంట్ అంశాలపై కమిటీ మూడు సార్లు సమావేశమైంది. ఉద్యోగుల సంఘాలతో ఒకసారి సమావేశం నిర్వహించాం. పీఆర్‌సీ ప్రతిపాదనలతో పాటు ఫిట్‌మెంట్‌కు సంబంధించి ఏడు విధాలుగా (సినారియాల్లో) సిఫార్సులు చేశాం. వీటిలో ఏదో ఒకటి ఆమోదించాలి. దీని వల్ల ప్రభుత్వంపై రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల అదనపు భారం పడుతుంది...’ అని వివరించారు. నిర్ణయం అనంతరం 2018 నుంచి వర్తిస్తుందన్నారు.
సీఎస్ ఇంకా ఏమన్నారంటే..
* గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు హోంగార్డులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి కూడా చేర్చాం.
* సిఫార్సు నివేదికలను ఆర్థిక శాఖ వెబ్‌సైట్‌లో పెడతాం. ఉద్యోగ సంఘాలకూ అందజేస్తాం.
* ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులనూ పరిశీలించాం. ఏపీలో మొత్తం వ్యయంలో ఉద్యోగులకు సంబంధించి 36% ఖర్చు చేస్తున్నాం. అదే చత్తీస్‌గఢ్‌లో 32%, మహారాష్ట్రలో 31%, పశ్చిమబెంగాల్‌లో 31%, ఒడిశాలో 29%, మధ్యప్రదేశ్‌లో 28%, హర్యానాలో 23%, తెలంగాణలో 21% ఖర్చు చేస్తున్నారు.
* ఐఆర్ 27% ప్రభుత్వం ఇచ్చింది. హెచ్‌ఆర్ ఖర్చు 2018-19 నుంచి 2020-21 వరకు 1,111% పెరిగింది.
* కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 14.29% ఐఆర్‌తో పోల్చి చూస్తే.. ఏపీలో 27%, కేరళలో 10%, తమిళనాడులో 2.5% ఇచ్చారు.
* ఏపీలో 1974లో ఫిట్‌మెంట్ 5%, 1986లో 10%, 93లో 10%, 2005లో 16%, 2010లో 39%, 2015లో 43% ఇచ్చారు.
సిఫార్సులిలా...
* 11 పీఆర్‌సీ సిఫార్సులతో పాటు 23% ఫిట్‌మెంట్‌తో భారం రూ.11,557 కోట్లు