ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎన్నికలు, వ్యాక్సినేషన్ ఒకేసారి సాధ్యం కాదు' - CS Das comments on elections news

ధర్మాసనాల ఆదేశాల దృష్ట్యా రాష్ట్రంలో ఒకేసారి పంచాయతీ ఎన్నికలు, వ్యాక్సినేషన్ నిర్వహించాల్సి ఉన్నందున.... తగు మార్గదర్శకాల జారీకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఎన్నికల విధుల్లో 5 లక్షల మంది పాల్గొనాల్సి ఉన్నందున... టీకా పంపిణీ కార్యక్రమానికి ఆటంకం కలగొచ్చని... ఓ దఫా వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఎన్నికల దృష్ట్యా రెండో డోసు ఇవ్వడం క్లిష్టంగా మారిందని పేర్కొంది. వీటిపై కేంద్ర సహకారాన్ని కోరింది.

CS Das Write Letter to Union Government over Covid Vaccine
'ఎన్నికలు, వ్యాక్సినేషన్ ఒకేసారి సాధ్యం కాదు'

By

Published : Jan 26, 2021, 4:50 AM IST

'ఎన్నికలు, వ్యాక్సినేషన్ ఒకేసారి సాధ్యం కాదు'

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలతో పాటు ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఏకకాలంలో వ్యాక్సినేషన్ చేపట్టాల్సి ఉన్నందునా తగు మార్గనిర్దేశనం చేయాలంటూ... కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యదర్శికి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 35వేల పోలింగ్ కేంద్రాల్లో 5 లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉందని లేఖలో ప్రస్తావించారు.

సుప్రీం, హైకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలు తప్పనిసరై నిర్వహించాల్సి ఉన్నందున.. ఎందరో ఉద్యోగులు, ఫ్రంట్‌లైన్ వారియర్లకు వ్యాక్సినేషన్ చేయలేని పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. 2వేల 41 సెషన్‌ సైట్లలో తొలి విడతలో 3లక్షల 87 వేల మందికి, రెండో విడతలో 7 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికి లక్షా 49 వేల మందికి టీకా వేశామని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేవారికి వ్యాక్సిన్‌ వేసేందుకు వీలు పడకపోవచ్చని, వారి విధుల కారణంగా ఒక డోసు తీసుకున్నవారికి అదే డోసు మళ్లీ ఇచ్చేందుకు రవాణా చిక్కులు ఏర్పడొచ్చన్నారు.

కొవిన్ యాప్ కారణంగా.. సెషన్ సైట్లలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అవకాశమివ్వాలని లేఖలో సీఎస్ విన్నవించారు. ఎన్నికల విధుల కోసం నియమించిన 73వేల 138 మంది పోలీసు సిబ్బంది, 3 పోలింగ్ కేంద్రాలకు ఒక్కరు చొప్పున బందోబస్తుకు కేటాయించాల్సి ఉందని.... వీరిని ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడమే ప్రహసనంగా మారుతుందన్నారు. ఈ నేపథ్యంలో.... వ్యాక్సినేషన్, పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను సూచించాల్సిందిగా సీఎస్ కోరారు.

ఇదీ చదవండీ... ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం చివరి వరకు పోరాడింది: సజ్జల

ABOUT THE AUTHOR

...view details