ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో యూనిసెఫ్ అందిస్తున్న సహకారం కీలకమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. యూనిసెఫ్ – ఏపీ ప్రభుత్వ వార్షిక సమావేశంలో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో గతేడాది చేపట్టిన పథకాల్లో అభివృద్ధిని యూనిసెఫ్ ప్రతినిధులు వివరించారు.
యూనిసెఫ్ - ఏపీ ప్రభుత్వ వార్షిక సమావేశం - యునిసెఫ్ ఏపీ వార్షిక సమావేశం న్యూస్
యూనిసెఫ్ - ఏపీ ప్రభుత్వ వార్షిక సమావేశంలో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ హాజరయ్యారు. ఆరోగ్యం, విద్యపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని యూనిసెఫ్ ప్రతినిధులకు వివరించారు.
యునిసెఫ్-ఏపీ ప్రభుత్వ వార్షిక సమావేశం
2021 - 22 సంవత్సరంలో లక్ష్యాలను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు వివరించారు. కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు తలెత్తినా... ఏపీలో చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయటం సంతోషదాయకమని యూనిసెఫ్ ప్రతినిధులు తెలిపారు. ఆరోగ్యం, విద్యపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎస్ తెలిపారు. పేదలకు, బాలింతలకు, చిన్నారులకు, గర్భిణులకు పౌష్టికాహారం అందజేస్తున్నట్లు వివరించారు.