హైదరాబాద్‌లోని సీఆర్‌పీఎఫ్ క్యాంపులో విషాదం చోటుచేసుకుంది. తుపాకీతో కాల్చుకుని సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. గుజరాత్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఠాకూర్ శంకర్ మియాపూర్ నడిగడ్డ తండా సమీప క్యాంపులో విధులు నిర్వహిస్తున్నాడు. క్యాంపులో ఎవరూ లేని సమయంలో శంకర్... ఎస్ఎల్ఆర్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణ: తుపాకీతో కాల్చుకుని సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
కుటుంబ కలహాల కారణంగా ఓ సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుజరాత్‌కు చెందిన ఠాకూర్ శంకర్.. మియాపూర్ నడిగడ్డ తండా సమీప క్యాంపులో విధులు నిర్వహిస్తున్నాడు. శంకర్ భార్య కూడా సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కాగా... ఇద్దరి మధ్య చోటుచేసుకున్న ఘర్షణలే ఆత్మహత్యకు కారణమా..? అని పోలీసులు అనుమానిస్తున్నారు.
సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
ఠాకూర్ శంకర్ భార్య కూడా సీఆర్పీఎఫ్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. శంకర్‌కు తన భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయని సహచరులు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించినట్లు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారని... ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారని సీఆర్‌పీఎఫ్ ఐజీ మహేశ్ చంద్ర లడ్హా తెలిపారు.