గడచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని 13 వేల 337 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టుగా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది. ఈ నెల 25, 26 తేదీల్లో పడిన భారీ వర్షాలకు కర్నూలు, ప్రకాశం, కడప, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పంటనీటమునిగి నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేశారు.
పత్తి, వేరుశనగ, కంది, మినుము, ఆవాలు, పొద్దుతిరుగుడు పంటలు నష్ట పోయినట్టుగా ప్రభుత్వం లెక్కగట్టింది. కర్నూలు జిల్లాలో 5 వేల 271 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 6,482 ఎకరాల మేర, కడప జిల్లాలో 976 ఎకరాలు నీటమునిగి.. పంట నష్టపోయినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇక గుంటూరు జిల్లాలో 624 ఎకరాలు, నెల్లూరులో 24 ఎకరాల పంట నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమిక అంచనాలు రూపొందించారు.