తెలంగాణ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో దారుణం చోటుచేసుకొంది. మంజీరా నదిలోకి దిగి గేదెలను కడుగుతున్న పశువుల కాపరిపై మొసలి దాడిచేసింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందారు.
ఇసోజిపేట- కోడూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో పశువుల కాపరి రాములు గేదెలను కడుగుతున్నాడు. ఒక్కసారిగా అతనిపై మొసలి దాడి చేసింది. అక్కడకు సమీపంలో ఉన్న సహచర పశువుల కాపరులు దీన్ని గమనించారు. తమ వద్ద ఉన్న కర్రలతో, అరుస్తూ ఒడ్డు పైనుంచే పెద్ద శబ్ధాలు చేసినా.. మొసలి విడిచిపెట్టలేదు. కొద్దిసేపటికి రాములు మృతదేహం పైకి తేలింది. ఈ ఊహించని ఘటనతో గ్రామస్థులు షాక్కు గురయ్యారు.