ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Farmers Protest: 'అప్పటి వరకు మా భూముల్లో అడుగుపెట్టనివ్వం' - రాజధాని రైతులతో సీఆర్డఏ అధికారుల సమావేశం

కృష్ణా కరకట్ట విస్తరణలో భూములను కోల్పోతున్న రైతులతో సీఆర్​డీఏ అధికారులు ఇవాళ సమావేశమయ్యారు. తమకు న్యాయం జరిగేంత వరకూ భూములను ఇచ్చేది లేదని రైతులు సీఆర్​డీఏ అధికారులకు తేల్చి చెప్పారు.

అప్పటి వరకు మా భూముల్లో అడుగుపెట్టనివ్వం
అప్పటి వరకు మా భూముల్లో అడుగుపెట్టనివ్వం

By

Published : Jun 15, 2022, 3:33 PM IST

కృష్ణా కరకట్ట విస్తరణలో తమకు న్యాయం జరిగేంత వరకూ భూములను ఇచ్చేది లేదని రైతులు సీఆర్​డీఏ అధికారులకు తేల్చి చెప్పారు. కరకట్ట విస్తరణ పనులను అడ్డుకున్న రైతులు.. తమకు నష్టపరిహారం అందించేంత వరకు భూముల్లో అడుగుపెట్టనివ్వమని రెండు రోజుల క్రితం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంగళవారం రైతులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో అధికారులు చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చారు. ఉండవల్లి పొలాల్లో రైతులతో సీఆర్డీఏ అధికారులు సమావేశమయ్యారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం గజానికి రూ.10 వేలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేయగా..రూ. 5000 ఇస్తామని అధికారులు చెప్పారు. అధికారుల ప్రతిపాదనలను రైతులు తోసిపుచ్చడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.

ABOUT THE AUTHOR

...view details