రాజధాని ప్రాంతంలో చేపట్టిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించింది. దీని కోసం రివర్స్ టెండరింగ్ నోటీసును జారీ చేసింది. బిడ్లు దాఖలు చేసేందుకు ఈ నెల 24 తేదీ వరకు గడువు ఇచ్చింది. 656 కోట్ల రూపాయల మేర పనులను ఇనీషియల్ బెంచ్ మార్క్‌గా నిర్దేశించి ఆ మొత్తానికి రివర్స్ టెండర్లను పిలిచింది. గతంలో 658 కోట్ల రూపాయలకు టెండర్లను పిలిచిన సీఆర్డీఏ.. ప్రస్తుతం 2 కోట్ల రూపాయల మేర పనులు పూర్తి కావటంతో మిగిలిన మొత్తానికి రివర్స్ టెండరింగ్ పిలవాలని నిర్ణయించింది.
మొత్తం 12 టవర్లుగా 1200 ఫ్లాట్లు నిర్మించే లక్ష్యంతో రాజధాని ప్రాంతంలోని నేలపాడు వద్ద హ్యపీనెస్ట్ ప్రాజెక్టుకు గతంలో సీఆర్డీఏ శ్రీకారం చుట్టింది. 2018 నవంబరున ఫ్లాట్ల బుకింగ్ ప్రక్రియను కూడా నిర్వహించింది. నేల చదును చేయటం, ఇతర నిర్మాణ పనులు 0.3 శాతం జరిగినట్లు అంచనా. 25శాతం లోపు జరిగిన పనులన్నీ ఆపేయాలన్న వైకాపా ప్రభుత్వ నిర్ణయంతో అవి నిలిచిపోయాయి.
ప్రాజెక్టు వివరాలు