CRDA on Amaravathi Developments Works: హైకోర్టు ఉత్తర్వులకు ఏపీసీఆర్డీఏ కట్టుబడి ఉంటుందని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే పనులు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది నవంబర్ నాటికి రాజధానిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల నివాస భవనాలకు సంబంధించిన పనులు పూర్తి అవుతాయని కమిషనర్ తెలిపారు. రాజధాని పరిధిలో పనులు చేపట్టేందుకు సీఆర్డీఏకు నిధులు అవసరం అవుతాయని.. అందుకే అమరావతి టౌన్ షిప్ లాంటివి అభివృద్ధి చేసి ప్లాట్లు విక్రయిస్తున్నట్లు చెప్పారు. నవులూరులో అభివృద్ధి చేసిన లేఅవుట్లో రూ. 310 కోట్ల వరకూ ఆదాయం వచ్చే అవకాశముందని సీఆర్డీఏ కమిషనర్ వెల్లడించారు.
CRDA: 'హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే అమరావతిలో పనులు' - APCRDA
APCRDA would abide by the High Court Orders: హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే అమరావతిలో పనులు జరుగుతున్నాయని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ వెల్లడించారు. నవంబర్ నాటికి రాజధానిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలకు సంబంధించి పనులు పూర్తి అవుతాయన్నారు.
రాజధాని పనుల కోసం రుణం ఇవ్వాలని బ్యాంకులనూ సంప్రదించామని.. రూ. 3 వేల కోట్ల రుణాలను రెండు దశల్లో ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఎల్పీఎస్ లే ఆవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని.. ఆ అవుట్ల అభివృద్ధికి సంబంధించి రైతులకు ఇచ్చిన హామీలకు సీఆర్డీఏ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కరకట్ట రహదారిని అభివృద్ధి చేస్తున్నాం.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే.. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుకు సంబంధించి సీఆర్డీఏ మధ్యవర్తి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: