పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ఆదేశాలపై ఏపీ పిటిషన్‌ను ధర్మాసనం సోమవారం విచారించనుంది. ఈ చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. రాజధాని పిటిషన్‌లో అమరావతి ఐకాస, రైతులు కేవియట్ దాఖలు చేశారు. కేవియట్ వేసిన వారికి పిటిషన్ కాపీ పంపినట్లు గతంలోనే ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అదేరోజు అమరావతిలో ఇళ్లస్థలాల పంపిణీ, ఆర్-5 జోన్‌పై పిటిషన్లు విచారణకు రానున్నాయి. ఇళ్ల స్థలాలు, ఆర్-5 జోన్ ఏర్పాటుపై హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం సవాలు చేసింది.
హైకోర్టు స్టేటస్‌కోపై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ - ఏపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వార్తలు
హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అదేరోజు అమరావతిలో ఇళ్లస్థలాల పంపిణీ, ఆర్-5 జోన్‌పై పిటిషన్లు విచారణకు రానున్నాయి. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై అమరావతి ఐకాస, రైతులు కేవియట్ దాఖలు చేశారు.
ఆ చట్టాలపై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ
TAGGED:
ap 3 capitals latest news