ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మూడు రాజధానులు అభివృద్ధికి విఘాతం '

రాష్ట్ర ప్రయోజనాలకు మూడు రాజధానులు విఘాతమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపిన ఆయన.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై దృష్టిసారిస్తే మంచిదని హితవుపలికారు. అమరావతి దేశానికే ప్రతీక అని అఖిల భారత హిందూ మహా సభ ప్రతినిధి చక్రపాణి మహారాజ్​ అన్నారు. రాజధాని కోసం రైతులు చేస్తున్న దీక్షకు హిందూ మహాసభ మద్దతు ఉంటుందన్నారు. వైకాపా ప్రభుత్వం రైతులతో చర్చించి సమస్య పరిష్కరించాలని ఇండియన్ ముస్లిం లీగ్​ అభిప్రాయపడింది.

By

Published : Jul 4, 2020, 7:49 PM IST

'మూడు రాజధానులు అభివృద్ధికి విఘాతం '
'మూడు రాజధానులు అభివృద్ధికి విఘాతం '

మూడు రాజధానుల ప్రకటన రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని, ప్రాంతాల మధ్య విద్వేషాలు వచ్చే అవకాశం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అభిప్రాయపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, లోటు బడ్జెట్ పూడ్చుకునే అవకాశాలపై సీఎం జగన్ దృష్టి పెట్టాలని కోరారు. అమరావతి విషయంలో భాజపా స్పష్టంగా ఉండాలన్న మధు... రెండు నాల్కల ధోరణిలో వ్యవహరించడం సమంజసం కాదని హితవుపలికారు.

అమరావతి దేశానికే ప్రతీక : చక్రపాణి మహారాజ్​

దక్షిణ అయోధ్యగా అమరావతికి ఎంతో చారిత్రక పేరుందని అఖిల భారత హిందూ మహాసభ ప్రతినిధి చక్రపాణి మహారాజ్ కీర్తించారు. అమరావతి అనేది రాష్ట్రానికే కాదు దేశానికే ప్రతీకగా నిలుస్తుందన్నారు. రాజధాని కోసం రైతులు, మహిళలు చేస్తున్న దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. రామమందిరం కోసం ఏ విధంగా పోరాడి సాధించుకున్నామో అదే విధంగా దక్షిణ అయోధ్య అమరావతిలో రామమందిరం స్థాపించి తీరుతామని స్పష్టంచేశారు. రాజధాని కోసం ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. రాజధాని కోసం దీక్షలు చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు దాడి సమంజసం కాదని చక్రపాణి మహారాజ్‌ పేర్కొన్నారు.

పార్లమెంట్​లో చర్చిస్తాం : బషీర్​ అహ్మద్

200 రోజుల నుంచి రైతులు దీక్షలు చేస్తుంటే జగన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రతినిధి బషీర్ అహ్మద్ అన్నారు. రైతులు చేస్తున్న దీక్షకు ముస్లిం లీగ్ పార్టీ తరుపున మద్దతు తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారించాలని సూచించారు. రాజధానిగా అమరావతి ఉండాలని జగన్ అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారని గుర్తుచేశారు. రాజధానిగా ఈ ప్రాంతానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. పార్లమెంట్​లో ఈ సమస్య మీద చర్చ లేవనెత్తుత్తామని బషీర్‌ అహ్మద్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి :కొత్త జిల్లాకు మన్యం వీరుడు అల్లూరి పేరు పెట్టాలి: పవన్

ABOUT THE AUTHOR

...view details