ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: మధు - CPM madhu latest news

కరోనా నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Cpm madhu
Cpm madhu

By

Published : Jun 5, 2020, 1:24 PM IST

కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ రంగ కార్మికులను ప్రభుత్వ ఇసుక విధానం మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. ఇసుక విధానం పూర్తిగా అవినీతిమయమైపోయిందని..., ఇసుక దొరక్క నిర్మాణాలు నిలిచిపోయి కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ఇసుక విధానంలో అవినీతిని అదుపు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మిక కుటుంబానికి కరోనా కాలానికి 10 వేల రూపాయలు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిధుల నుంచి ఇచ్చి ఆదుకోవాలని కోరారు. జూన్ 8వ తేదీన భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరుతూ కార్మిక సంఘాలు చేపట్టిన కార్యక్రమానికి పూర్తి మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేశారు.

కరోనా నుంచి ప్రజలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ కు పంపుతున్నారే తప్ప సరైన వసతులు, వైద్యం అందించలేకపోతున్నారని ఆక్షేపించారు. క్వారంటైన్ కేంద్రాలలో వసతులు మెరుగుపరచాలని...సరైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details