ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ సీపీఎం కౌంటర్‌ దాఖలు - ఏపీ హైకోర్టులో సీపీయం అఫిడవిట్ వార్తలు

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు... హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. రాజధానితో సంబంధం లేదని కేంద్రం చెప్పటం సమంజసం కాదని పేర్కొన్నారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌ అసెంబ్లీలోనే రాజధానిగా అమరావతిని సమర్థించారని అఫిడవిట్‌లో గుర్తు చేశారు.

cpm
cpm

By

Published : Nov 4, 2020, 6:27 PM IST

అమరావతే రాజధానిగా కొనసాగాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. రాజధాని విషయంలో కేంద్రం తమకు సంబంధం లేదని చెప్పటం సమంజసం కాదని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయే సమయంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను నిర్ణయించింది కేంద్రమేనని గుర్తు చేశారు. రాజధానిలో హైకోర్టు, రాజ్ భవన్, తదితర భవనాల నిర్మాణాలకు కేంద్రం 1500 కోట్ల నిధులను కేంద్రం ఇచ్చిందని ప్రస్తావించారు.

రాజధానిలో కోట్ల రూపాయలు ఖర్చు చేశాక.. తరలిస్తున్నట్టు ప్రకటించారని.. ఈ ప్రభావం భూములిచ్చిన రైతుల భవిష్యత్​పై పడుతుందని చెప్పారు. రాజధాని మార్చితే రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించినట్లే అన్నారు. తరలింపు ఆలోచన ప్రజా ప్రయోజనాలకు, రాష్ట్రాభివృద్ధికి వ్యతిరేకమని తమ అభిప్రాయాన్ని కౌంటర్ లో తెలిపారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం వైఎస్ జగన్‌... అసెంబ్లీలోనే రాజధానిగా అమరావతిని సమర్థించారని అఫిడవిట్‌లో గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details