అనంతపురం జిల్లాలో ఉన్న కియా పరిశ్రమను బుధవారం సందర్శించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రాష్ట్రం నుంచి కియా పరిశ్రమ తరలిపోతుందని రాయిటర్స్ ప్రచురించిందని.. అదే విషయానికి కట్టుబడి ఉన్నట్లు కూడా స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం అనాలోచిత విధానాలను అవలంబిస్తోందని దుయ్యబట్టారు. కియాను అధికార పార్టీ నేతలు బెదిరించినట్లుగా తెలుస్తోందని అన్నారు.
ఎల్లుండి కియా సందర్శనకు సీపీఐ బృందం: రామకృష్ణ - కియా సందర్శనకు సీపీఐ బృందం వార్తలు
సీపీఐ బృందం బుధవారం కియా పరిశ్రమను సందర్శించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ చెప్పారు.
cpi team visit kia industry wednesday on this week